ఖమ్మంలో లార్డ్స్ చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ కర్ణన్ ప్రారంభించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెండు బస్సులను కేటాయించారు.
కొవిడ్ రోగులకు ఈ మొబైల్ వ్యాన్‌లో పూర్తి వసతులతో చికిత్స అందించనున్నారు. ఇటీవల ఈ బస్సులను హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జిల్లాకు ఒక్క బస్సు చోప్పున సంస్థ అందచేసింది. వైద్యారోగ్య శాఖ అధికారుల సూచనమేరకు బస్సులను గ్రామాలకు తరలించి చికిత్స అందించనున్నారు.
ఇదీ చదవండి: Accident: భయంకరమైన ప్రమాదం.. చెట్టుపైన మృతదేహం..!