వేలాద్రి దేవుడి మొక్కుకు వెళ్లి వస్తున్న ఖమ్మం జిల్లా ఏర్రుపాలెం మండల వాసులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 10 మంది క్షత గాత్రులను ఆయన పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు ఆదేశించారు.
ఒకే కుటుంబంలో ఇంతమంది మృతి చెందటం విచారకరమన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిన వారిలో ఇద్దరు చనిపోగా..10 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వారికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ఆయన వెంట కలెక్టర్ కర్ణన్, మేయర్ పాపాలాల్ ఉన్నారు.