ETV Bharat / state

నేను కోరుకునేది అధికారం కాదు.. మీ అభిమానం: చంద్రబాబు - TDP chief Chandrababu khammam sabha

TDP chief Chandrababu khammam sabha: తెలంగాణలో అధికారం కోసం ఇక్కడకు రాలేదని.. మీ అభిమానం కోసమే ఖమ్మం నగరానికి వచ్చానని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. లక్షలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య ఖమ్మం నగరంలో ఆయన ప్రసంగం ఉద్విగ్నంగా సాగింది. తెలంగాణకు తాను చేసిన సేవలను గుర్తుచేసిన చంద్రబాబు.. తెలుగువారికి ఆత్మబంధువుగా ఉండాలన్నదే తన చిరకాల కోరికని ప్రకటించారు.

cbn
cbn
author img

By

Published : Dec 21, 2022, 8:44 PM IST

Updated : Dec 21, 2022, 10:22 PM IST

TDP chief Chandrababu in khammam: ఖమ్మం నగరంలో జరిగిన తెలుగుదేశం భారీ బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా ప్రసంగించారు. చాలాకాలం తర్వాత జిల్లాకు వచ్చిన తనకు ఇక్కడి ప్రజలు చూపుతున్న ఉత్సాహం ఆనందాన్ని కలిగించిందని సంతోశం వ్యక్తం చేశారు. ఇంతటి ఉత్సాహాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలంతా తన ఆత్మబంధువులన్న చంద్రబాబు... టీడీపీ రుణం తీర్చుకుంటామని భారీగా తరలివచ్చిన యువతకు కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మంలో సభా వేదిక పైకి తరలివస్తున్న చంద్రబాబునాయుడు

ఓట్ల కోసం రాలేదు: తాను కోరుకునేది అధికారం కాదని ప్రజల అభిమానమని చంద్రబాబు వివరించారు. ఎన్నికలు, ఓట్ల కోసం తానెప్పుడూ పని చేయలేదని... తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అభిమానమే కోరుకుంటున్నామని తెలిపారు. తెలుగువారి ఆత్మబంధువుగా శాశ్వతంగా మీ మదిలో ఉండాలనే పని చేస్తున్నానని చెప్పారు. తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిన ఏకైక నేత ఎన్టీఆర్‌ అని ప్రస్తావించిన చంద్రబాబు ఆ మహనీయుడు అధికారం కోసం పార్టీ పెట్టలేదని గుర్తు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే పార్టీ ఏర్పాటు చేశారని.. తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛను అందించారన్నారు.

అప్పట్లోనే గుర్తించినందునే ఇప్పుడీ ఫలాలు: తన ప్రసంగంలో హైదరాబాద్​లో ఐటీ అభివృద్ధికి తాను పట్ట కష్టాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఐటీ ప్రాధాన్యతను 25ఏళ్ల క్రితమే గుర్తించానని.. ఆ దిశగా యువత కోసం ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని గుర్తు చేసుకున్నారు. ఐటీ ప్రాధాన్యం గుర్తించి హైటెక్‌ సిటీని నిర్మించానని.. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ క్యాంపస్​లు పెట్టేందుకు ప్రపంచమంతా తిరిగానని ఆ కష్టానికి గుర్తింపు ఇప్పుడు కనిపిస్తోందని తెలిపారు. ఐటీలో భారతీయులతో ఎవరూ పోటీ పడలేరని ఆనాడే చెప్పానన్నారు. హైదరాబాద్‌కు ఐఎస్‌బీ కూడా తీసుకొచ్చేందుకు ఎన్నో పాట్లు పడ్డానని తెలిపారు. ఎంతో ముందుచూపుతో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేశానని.. ఇప్పుడు అందులోనే కరోనా టీకా తయారుకావడం సంతోషంగా ఉందన్నారు.

"సమైక్యాంధ్రలో పెనుమార్పులకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీనే. స్వచ్ఛందంగా వచ్చిన నిజమైన కార్యకర్తలు మీరు. రోడ్డు వెంబడి యువత వీరోచితంగా ముందుకు వచ్చారు. మాకు ఐటీ ఆయుధాన్ని ఇచ్చావు.. ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాము. తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకుంటామని యువత ముందుకు వచ్చారు. బంగారు భవిష్యత్‌కు బాటలు వేసిన మీకు అభినందనలు తెలిపారు. నేను కోరుకునేది అధికారం కాదు మీ అభిమానం. తెలుగువారు ఎక్కడ ఉన్నా మీ అభిమానం కోరుకుంటున్నా.. తెలంగాణ గడ్డ హైదరాబాద్‌లోనే టీడీపీ ఆవిర్భవించింది." - నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

నేను కోరుకునేది అధికారం కాదు.. మీ అభిమానం: చంద్రబాబు

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.