ETV Bharat / state

కష్టకాలంలో ఆదుకున్న ‘రైతుబంధు’ - Rythu Bandhu scheme is helping bhadradri farmers

‘రైతు బంధు పథకం’ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని ఐదు వ్యవసాయ మార్కెట్లకు రూ.18కోట్ల నిధులు మంజూరు చేసింది. వీటిలో ఇప్పటి వరకు రెండు జిల్లాలకు చెందిన 1137మంది రైతులకు మార్కెటింగ్‌ శాఖ ద్వారా రూ.12.76 కోట్ల రుణాలందాయి. వీటిలో అత్యధిక భాగం మిరప రైతులే కావడం గమనార్హం. ఇది జిల్లా రైతులకు ఎంతో ఊరట కలిగిస్తోంది.

Rythu Bandhu scheme is helping farmers
ఆదుకున్న ‘రైతుబంధు’
author img

By

Published : May 4, 2020, 8:21 AM IST

లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులకు పంట చేతికొచ్చిన సమయంలో అమ్ముకోవాలంటే ఎక్కడా అవకాశం లేదు. పెద్ద ఎత్తున చేతికొచ్చిన మిరప పంటను రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకున్నారు. కానీ కనీస అవసరాలకు చేతిలో చిల్లి గవ్వలేదు.

ఇప్పుడు రైతు బంధు పథకం ద్వారా మంజూరైన నిధులతో రైతులు ఆర్థిక రుణం పొందే వెసులుబాటు కలిగింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మద్దినేని వెంకటరమణ తెలిపారు. రైతులు కష్టకాలంలో ఉన్న సమయంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లాకు నిధులు మంజూరు చేయించినట్లు ఆయన వివరించారు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమలు ఇలా...

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా మిరప సాగుచేస్తున్నారు. ఈసారి మిరప రైతులకు కూడా రైతుబంధు వర్తింపజేశారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 35 శీతల గిడ్డంగులు ఉండగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఒకటి మాత్రమే ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో రైతులు నిల్వ ఉంచుకునేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన శీతల గిడ్డంగుల్లో అవకాశం కల్పించారు. దీంతో ఆ జిల్లా రైతులు కూడా ఖమ్మం జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్ల పరిధిలో రైతుబంధు రుణ సౌకర్యం పొంది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి నాగరాజు తెలిపారు.

మార్కెట్‌ రైతులు రుణం(రూ.లక్షల్లో)

ఖమ్మం 334 456.70

మధిర 334 249.53

నేలకొండపల్లి 128 136.75

వైరా 109 120.26

మద్దులపల్లి 234 312.91

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.