ఖమ్మం జిల్లా తల్లాడలో జిల్లా న్యాయసంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హనుమంతు, శిక్షణ కలెక్టర్ ఆదర్శ్‌తో పాటు మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. 'పర్యావరణాన్ని కాపాడాలి... ప్లాస్టిక్ నిర్మూలించాలి' అంటూ ఖమ్మం-రాజమండ్రి జాతీయ రహదారిపై ప్రదర్శన చేశారు. రింగ్‌రోడ్డు కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నిర్మూలనను ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండిః ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?