ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 40వ రోజుకు చేరింది. మహబూబాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన కార్మికుడికి ఖమ్మం బస్ డిపో కార్యాలయం ఎదుట శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆర్టీసీ మహిళా ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం మొండి వైఖరి వల్లే కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ