ETV Bharat / state

ఈ మార్గాల్లో ప్రయాణం ప్రమాదకరం

ఖమ్మం జిల్లాలోని మధిర-విజయవాడ జాతీయ రహదారితోపాటు మధిర-నందిగామ, మధిర-తిరువూరు మార్గాలు..  వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గుంతలు ఏర్పడటం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఖమ్మం జిల్లాలో ఈ మార్గాల్లో ప్రయాణం ప్రమాదకరం
author img

By

Published : Aug 19, 2019, 10:51 PM IST

ఈ మార్గాల్లో ప్రయాణం ప్రమాదకరం

నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన రహదారులివి. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాలకు చేరేందుకు ఇవే ఆధారం. గతేడాది కాలంగా ఈ మార్గాలన్నీ దుర్భరంగా మారి.. ప్రమాదాలకు నిలయంగా తయారయ్యాయి.

మధిర నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారితోపాటు, మధిర-నందిగామ రోడ్డు, మధిర-తిరువూరు మార్గాలకు గుంతలు ఏర్పడ్డాయి. వర్షాలు పడినప్పుడు గుంతల్లో నీరు చేరి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా రహదారులు మరమ్మతులకు నోచుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పడు, రాత్రి వేళల్లో ప్రయాణాలు.. సాహసయాత్రను తలపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుంతల వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయని.. తామూ ఆస్పత్రుల బాట పట్టాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారుల మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీచూడండి: బేతపల్లి చెరువు నుంచి నీటి విడుదల

Intro:TG_KMM_01_18__ pramadalato_prayanam_vis1_pkg_TS10089

Body:kp

Conclusion:kp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.