ETV Bharat / state

Congress Public Meeting Khammam : జులై 2న తెలంగాణ జనగర్జన సభ.. ఏర్పాట్లపై నేడు కాంగ్రెస్ సన్నాహక భేటీ - తెలంగాణ వార్తలు

Congress Public Meeting Khammam 2023 : ఖమ్మం సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కనీవినీ ఎరగని రీతిలో బహిరంగ సభను నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి ఒక డీసీసీ అధ్యక్షుడిని ఇంఛార్జిగా నియమించి జన సమీకరణ చేయాలని భావిస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఖమ్మంలో ముఖ్య నేతలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన సన్నాహక సమావేశం జరగనుంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 30, 2023, 10:26 AM IST

Congress Public Meeting Khammam on July 2nd : ఖమ్మంలో జులై 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేసేందుకు పీసీసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అయన అనుచర గణం చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు రెండిటికి కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న సభ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

గతంలో ఎన్నడూ ఎవరూ నిర్వహించనంత భారీగా ఈ సభను నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే ఖమ్మం పట్టణ సమీపంలో 110 ఎకరాల భూమిలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తోంది. చేరికలతోపాటు సభ పాదయాత్ర ముగింపునకు చెందిన సభ కావడం, ఆ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు అవుతుండడంతో భారీ జనసమీకరణ చెయ్యాలని కాంగ్రెస్ భావిస్తోంది. సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్లపై ఇవాళ ఖమ్మంలో సన్నాహక సమావేశం నిర్వహించనుంది.

Rahul Gandhi Attends Khammam Congress Public Meeting : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్ రావు ఠాక్రేల నేతృత్వంలో ఖమ్మంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్లు, డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల చైర్మన్లు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే నాయకులకు సమాచారం అందజేశారు. ఈ సన్నాహక సమావేశంలో రెండవ తేదీన సభ నిర్వహణ, విధి విధానాలు, జన సమీకరణ, ప్రచార ఆర్భాటం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

రాష్ట్రంలో చురుకైన పదిమంది డీసీసీ అధ్యక్షులను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 సెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిలుగా నియమించనున్నారు. వీరికి మద్దతుగా జన సమీకరణ కోసం నియోజకవర్గ ఇంఛార్జీలు, మండల అధ్యక్షులు పనిచేస్తారు. అదే విధంగా ఉమ్మడి ఖమ్మం తోపాటు పరిసర జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 20 నుంచి 30 వేల మందిని తరలించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి కూడా జనాన్ని తరలించేట్లు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

గతంలో బీఆర్​ఎస్​ ఆవిర్భావ సభ కంటే ఎక్కువ మంది ‘’ తెలంగాణ జన గర్జన’’ సభకు వస్తారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు ఇప్పటికే సవాల్ విసిరారు. ఈ గర్జన సభకు భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతుండటంతో వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసే బాధ్యతను రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నాయకులకు అప్పగించనున్నారు. ప్రధానంగా మంచినీళ్లు, మజ్జిగ, భోజన సౌకర్యం లాంటివి ఎలా ఉండాలో నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. మరోవైపు రెండో తేదీన సభకు సంబంధించి ఎలక్ట్రానిక్, ప్రింట్​ మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల ద్వారా భారీ ఎత్తున ప్రచారం నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్కలు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.