Political Heat in Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నికల్లో పైచేయి కోసం అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ(Congress and BRS clash in Khammam) అంటే ఢీ అంటున్నాయి. బీఆర్ఎస్లో అభ్యర్థుల ప్రకటన పూర్తై ప్రచారంలోకి దూకేందుకు ముమ్మరంగా సన్నద్ధవుతుంది. అభ్యర్థుల ప్రకటనకు ముందే నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించేందుకు.. ముఖ్యనేతలను హస్తం పార్టీ రంగంలోకి దించింది. అంతా కలసిమెలిసి ముందుకెళ్లాలని జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.
Khammam Politics 2023 : ప్రచారంలో దూకుడు పెంచడంతో పాటు పార్టీ మేనిఫెస్టో(BRS Election Manifesto 2023)ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న నేతలు.. ప్రచారం, ఎన్నికల కార్యాచరణకి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున మొత్తం ఖమ్మం జిల్లాకు 15 మందిని సమన్వయ బాధ్యులుగా నియమించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభల విజయవంతానికి కలిసి కట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు.
"ప్రత్యర్థి పార్టీలు ఇంకా తేల్చుకోలేని సమయంలో కాంగ్రెస్ పార్టీ రెండే స్థానాలు ప్రకటించినా.. మేము చాలా క్లారిటీతో అభ్యర్థులను ప్రజల్లోకి పంపాం. ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు విభిన్నంగా ఆలోచించాలి. తెలంగాణ ఏర్పడి తొమ్మిదిన్నర సంవత్సరాలే అయినా మిగతా అన్ని జిల్లాల కన్నా అభివృద్ధి, సంక్షేమంలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉంది. నాలుగున్నర ఎకరాల పోడు భూములను గిరిజనులకు పట్టాలు అందిస్తే అందులో లక్షన్నర ఎకరాలు ఖమ్మంలోనే అందించారు సీఎం కేసీఆర్." - పువ్వాడ అజయ్ కుమార్,రవాణాశాఖ మంత్రి
Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు
Congress Focus on Khammam District : 10 అసెంబ్లీ స్థానాలకు గాను రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. త్వరలోనే రెండో జాబితా విడుదలకు సిద్ధమవుతోంది. ఖమ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. పాలేరు నుంచి పొంగులేటి బరిలోకి దిగడం దాదాపు ఖాయం అయినట్లు కనిపిస్తుంది. దాంతో ఆయా నియోజకవర్గాల(Congress Focus on Khammam)పై వారిరువురు ప్రత్యేక దృష్టి పెట్టారు. అసమ్మతి లేకుండా చూసుకునేలా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు టికెట్ ఆశించిన.. నేతల ఇంటికి వెళ్తున్న పొంగులేటి, తుమ్మల.. ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. పాత కొత్తల కలయికతో ఐక్యంగా పనిచేద్దామని సూచిస్తున్నారు.
"పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏ కార్యకర్తకు ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే అనేక గ్రామాల్లో పెట్టిన అక్రమ కేసులు హైకోర్టు వరకు వెళ్లాయి. కాంగ్రెస్ కేడర్‌ను మనస్ఫూర్తిగా ముందుండి కాపాడారు. భవిష్యత్తులో తుమ్మల నాగేశ్వరరావు, నేను అన్నదమ్ముల్లా ప్రయాణిస్తాం." - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-ఛైర్మన్
Telangana Election Fight 2023 : బీఆర్ఎస్ ఐక్యతారాగం.. కాంగ్రెస్ సమన్వయ మంత్రం.. ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి. ఈసారి మాత్రం ఖమ్మం రాజకీయాల్లో ఈ ఎన్నికలు ప్రత్యేకంగా నిలిచే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్, వామపక్షాలకు కంచుకోట లాంటి ఖమ్మంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.