ETV Bharat / state

Political Heat in Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రసవత్తర సమరం.. అసెంబ్లీ పోరుకు సై అంటే సై - 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వ్యూహాలు

Political Heat in Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి రేసులో ముందువరుసలో ఉండగా.. పలు చోట్ల అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో చోట్ల అసంతృప్తులు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 103 మంది అర్జీ చేసుకోవడం ఆ పార్టీకి కత్తిమీద సాములా మారింది. అమిత్ షా సభ విజయవంతంతో కొత్త ఉత్సాహంలో ఉన్న బీజేపీ.. బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది.

Khammam Politics 2023
Political Heat in Khammam District
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 7:07 AM IST

Political Heat in Khammam District ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజుకుంటున్న ఎన్నికల వేడి అసెంబ్లీ పోరుకు సై అంటే సై అంటూ

Political Heat in Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సర్వసన్నద్ధమవుతున్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు.. బీఆర్ఎస్ అధినేత పార్టీ కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. టికెట్‌ ఆశించిన పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలేరులో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి టికెట్ ఖరారుతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులతో కలిసి బలప్రదర్శన చేశారు. రాబోయే ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. సెప్టెంబర్ మొదటి వారంలో తుమ్మల(Tummala Nageswara Rao) రాజకీయ పయనంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Assembly Elections Heat in Khammam : వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌ లాల్‌కు టికెట్(BRS MLA Ticket 2023) దక్కడం వల్ల ఎమ్మెల్యే రాములు నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్టీ పెద్దల నుంచి రాజకీయంగా లభించిన హామీతో అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమంటున్నారు. అయితే నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అనుచరగణమంతా కొత్త అభ్యర్థి ఎంపికపై కోపంతో ఉన్నారు.

BRS MLA Ticket Issues Telangana : అధికార పార్టీలో పెరుగుతోన్న అసమ్మతి గళం.. టికెట్ల కోసం ఆగని అసంతృప్త నేతల పోరాటం

BRS focus on Khammam Politics 2023 : మధిరలో జడ్పీ ఛైర్మన్ కమల్ రాజుకు టికెట్‌తో బీఆర్ఎస్ ఆవిర్భావ నాయకుల్లో ఒకరైన బొమ్మెర రామ్మూర్తి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తనకు మధిర టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కొత్తగూడెంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును మరోసారి బరిలో నిలపడంపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే రాజకీయ కార్యాచరణకు జలగం సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.

Khammam Politics 2023 : ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ(MLA Haripriya) అభ్యర్థిత్వం ఖరారుతో కామేపల్లి, బయ్యారం, ఇల్లెందులో పలువురు ముఖ్యనేతలు ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. భద్రాచలంలోనూ తెల్లం వెంకట్రావుకు టికెట్ దక్కడంపై స్థానిక బీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారు. తాము బరిలో ఉంటామని బుచ్చయ్య వర్గం బహిరంగంగానే ప్రకటించడంతో భద్రాచలంలో వర్గపోరు నెలకొంది. ఇలా పలు నియోజకవర్గాల్లో నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ అభ్యర్థులు, నేతలు రంగంలోకి దిగారు. అసమ్మతులు లేని చోట్ల అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దిగారు.

BRS MLAs Final Candidates List 2023 : బీఆర్​ఎస్​ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!

Telangana Congress Plans Assembly Elections 2023 : ఇక కాంగ్రెస్‌లో టికెట్ల పోరు(Congress MLA Tickets Telangana) రసవత్తరంగా మారుతోంది. 10 అసెంబ్లీ స్థానాలకు 103 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలకు 37 మంది, భద్రాద్రి జిల్లాలోని 5 నియోజకవర్గాలకు 66 మంది ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇల్లెందు నియోజకవర్గం నుంచి 36 మంది టికెట్ కోసం అర్జీ పెట్టుకున్నారు.

మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో(CLP Bhatti Vikramarka)పాటు డాక్టర్ రాంబాబు దరఖాస్తు చేసుకున్నారు. భద్రాచలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్యతోపాటు మరో ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మూడు స్థానాల్లో టికెట్ కోసం ప్రతిపాదనలు పంపించారు. పినపాక నుంచి ములుగు ఎమ్మెల్యే సీతక్క తనయుడు సూర్య దరఖాస్తు చేసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారింది.

BJP Telangana Election Plan 2023 : ఉమ్మడి జిల్లాలో సత్తా చాటాలన్న లక్ష్యంతో బీజేపీ(BJP Strategies for Telangana Assembly Elections 2023) ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఖమ్మంలో అగ్రనేత అమిత్‌ షా బహిరంగ సభకు లభించిన ఆదరణతో కాషాయ దళం ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి 10 అసెంబ్లీ నియోకవర్గాల్లో పర్యటించిన బీజేపీ ప్రజాప్రతినిధులు.. పార్టీ పరిస్థితి, అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర పార్టీకి నివేదికలు అందించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వం ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక కోసం సమావేశాలు నిర్వహించనుంది.

పొత్తులేకున్నా బరిలో నిలబడతాం : బీఆర్ఎస్​తో పొత్తు ఉంటుందని ఆశించిన కమ్యూనిస్టు పార్టీలు.. కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనతో సొంతంగా ఎన్నికల కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. కలిసి వచ్చే పార్టీలతో బరిలో నిలవడంతో పాటు.. ఒకవేళ ఎలాంటి పొత్తుల్లేకున్నా సీపీఎం, సీపీఐ సంయుక్తంగా బరిలో నిలిచేలా ప్రణాళికలు చేస్తున్నారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులిద్దరూ జిల్లాకు చెందిన వారే కావడంతో.. ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలపాలని రెండు పార్టీలు ప్రాథమికంగా నిర్ణయించాయి. తాజాగా కాంగ్రెస్‌తో పొత్తుల అంశం తెరపైకి వస్తుండటంతో.. కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉండొచ్చని కమ్యూనిస్టు పార్టీలు భావిస్తున్నాయి.

Minister Harish Rao Comments On Amit Shah : 'సీఎం పదవి కాదు కదా.. ఈసారి సింగిల్​ డిజిట్​ సాధించేందుకు పోరాడండి'

KCR Calls Joint Khammam District BRS Candidates : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు బీఆర్​ఎస్​ అభ్యర్థులకు కేసీఆర్‌ పిలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.