మూగజీవాలు అందులో శునకాలంటే ఆమెకు ప్రాణం. వాటికి చిన్న గాయమైనా చలించిపోతారు. ప్రమాదాలకు గురైన, జబ్బుల బారి పడిన వీధి శునకాలకు అమ్మ అవుతున్నారీ మేకల పద్మ. వాటిని పెంచి పోషిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఖమ్మం శివారు దానవాయిగూడెంలో రూ.10 వేలకు ఇల్లు అద్దెకు తీసుకుని అరవైకి పైగా శునకాలను పెంచి పోషిస్తున్నారు. వాటి కోసం బోన్లు, కూలర్లు, మంచాలు, పరుపులు కూడా ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నా మూగజీవాలనే తన బిడ్డలుగా భావిస్తున్నారు. కూలి పనులు చేసే కుమారులు, బెంగళూరులో ఉంటున్న కుమార్తె సాయంతో శునకాల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాతలెవరైనా ఆహార సామగ్రి రూపంలో ఇస్తే తీసుకుంటారు తప్ప నగదును అంగీకరించరు. ఈ ఆశ్రమంలో శునకాలతో పాటు పిల్లులు, కుందేళ్లు, గుర్రం కూడా ఉన్నాయి.
- ఇదీ చదవండి : Pet Lover: వీధి శునకాలకు చికెన్ బిర్యానీ