ఖమ్మంలో బస్టాండ్ కూడలి నుంచి కలెకట్ర్ కార్యాలయం వరకు వందలాది మంది పాఠశాల విద్యార్థులు పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నాచౌక్లో ధర్నాకు దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాఠశాలలు కూలిపోతుంటే ఎమ్మెల్యేలకు భవనాలు నిర్మించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః భూ సమస్యలపై ప్రజావేదికలో పాల్గొన్న పాలనాధికారి