ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మెజార్టీ సంఘాల్లో పీఏసీఎస్ ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. వైరా, గార్లఒడ్డులో ఒక్కరే నామినేషన్ వేయగా.. అధికారులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
వైరాలో బొర్ర రాజశేఖర్, ఏన్కూరులో మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వరరావు గెలుపొందారు. ఇద్దరూ తెరాస పార్టీ వారే కావటం వల్ల గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా