Ongole bull race: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంగోలు జాతి ఎడ్ల పందాలు బుధవారం ప్రారంభమయ్యాయి. డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జిల్లా రైతు నాయకులు మట్టా దయానంద్ ఈ పందేలను ప్రారంభించారు.
వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 16 నుంచి 19 వరకు ఎద్దుల పందేలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్ తరాలకూ ఒంగోలు వృషభ జాతిని అభివృద్ధి చేయడం కోసం.. పదిమందికి తెలియజేస్తే ఈ జాతి అంతరించిపోకుండా ఉంటుందని నిర్వాహకులు గొర్ల సత్యనారాయణరెడ్డి(బుల్లబ్బాయి) తెలిపారు. మనకు అన్నం పెట్టిన ఈ జాతిని ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.