భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని మిఠాయి దుకాణాలకు రంపపు పొట్టును సరఫరా చేస్తున్న చిన్నారులపై విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం అధికారుల దృష్టికి రావడం వల్ల ఇల్లందు ఇంఛార్జి లేబర్ ఆఫీసర్ కుటుంబరావు ఆరా తీస్తున్నారు.
ఇటీవల కొత్త బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో తోపుడు బండి మీద కొంతమంది చిన్నారులు రంపపు పొట్టును తీసుకొని వచ్చారు. ఈ విషయంపై విచారణ జరపాల్సిందిగా జిల్లా అధికారులు ఆదేశించారు.
ఇదీ చదవండి: రేషన్‌కార్డు దరఖాస్తులకు మోక్షం!