ఐదేళ్ల తెరాస పాలన దేశానికే ఆదర్శమని ఖమ్మం తెరాస లోక్‌సభ అభ్యర్థి నామ నాగేశ్వర రావు అన్నారు. రాష్ట్రంలో తెరాస 16స్థానాల్లో గెలుస్తుందని సర్వేలే చెబుతున్నాయన్నారు. ఖమ్మంలో తెరాస విజయం కష్టమనుకున్న చోటు నుంచే మొదటి గెలుపు ప్రకటన వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో సహకరించిన వారందరికీ వైరాలో కృతజ్ఞతలు చెప్పారు. నామతో పాటు ఎమ్మెల్యే రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు!