కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారని కేంద్రాన్ని తెరాస లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన చట్టంపై శ్రీకాకుళం ఎంపీ రామ్‌మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానమిచ్చారు. రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
మంత్రి సమాధానంపై స్పందించిన తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు... ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు ప్రధానితో సమావేశమయ్యారని గుర్తుచేశారు. కేంద్రం మాత్రం ప్రకటించిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: మారటోరియం కాలానికి రుణమాఫీ అసాధ్యం: సుప్రీం