రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాగుల చవితిని పురస్కరించుకొని బుధవారం ఉదయం నుంచే దేవాలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. ఆలయాల ప్రాంగణంలోని పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఖమ్మంలో ప్రత్యేక పూజలు
ఖమ్మం జిల్లాలో నాగుల చవితి పూజలు ఘనంగా జరుపుతున్నారు. ఆలయ ప్రాంగణంలోని పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. ఏన్కూరు మండలం గార్లలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో.... పుట్టలో పాలు పోసి భక్తులు మెుక్కులు తీర్చుకున్నారు.
భక్తిశ్రద్ధలతో పుట్నాలు, బెల్లం
పెద్దపల్లి జిల్లా మంథనిలోని బోయిన్‌పేటలోని పుట్ట వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పుట్నాలు, బెల్లం వంటి నైవేద్యాలు సమర్పించి ముడుపులు కట్టారు.
ఉదయం నుంచే సందడి
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం నుంచే సందడి మొదలైంది. బుధవారం తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు.
ఇదీ చదవండి: నాగులచవితి రోజు తిరుమలలో పెద్దశేష వాహనసేవ