కరోనా కాలంలో పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీ ఏర్పాట్లు సీఎం కేసీఆర్ ముందస్తు ప్రణాళికతోనే సాధ్యమైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కరోనా కాలంలోనూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాథమిక సహకార సంఘం భవనంలో 6,680 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను మంగళవారం పంపిణీ చేశారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో 70 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు. కరోనా విజృంభణ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్డౌన్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్, కృష్ణయ్య, నరసింహారావు, ఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ ప్రభావం- ఆహార వ్యవస్థలు అతలాకుతలం