ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో.. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి ప్రదర్శించగా పెను ప్రమాదం తప్పింది. మణుగూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు... హైదరాబాద్ నుంచి మణుగూరు వెళ్తోంది.
ఖమ్మం దాటిన తర్వాత వి.వెంకటాయపాలెం వద్ద టిప్పర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును పక్కకు తిప్పాడు. బస్సు రోడ్డు పక్కనే ఉన్న చేనులోకి దూసుకెళ్లింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ క్షేమంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: 'మన ఓటే.. మన భవిష్యత్‌ను మార్చే ఆయుధం'