ETV Bharat / state

ఆక్సిజన్​ అందలేదన్న ఫిర్యాదు రాకూడదు: పువ్వాడ - Khammam district latest news

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొవిడ్​ రోగులకు ఆక్సిజన్ అందలేదన్న ఫిర్యాదు రాకూడదని... మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. భద్రాచలం ఐటీసీ పేపర్‌ బోర్డు అధికారులతో చర్చలు జరిపి రోజూ 5 టన్నుల ఆక్సిజన్‌... జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి సరఫరా చేసే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Minister Puvvada ajay kumar arranges to oxygen supply
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆక్సిజన్​ సరఫరాకు మంత్రి పువ్వాడ చర్యలు
author img

By

Published : May 14, 2021, 2:17 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ లోటు లేకుండా ఉండేందుకు... మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ చర్యలు తీసుకున్నారు. భద్రాచలం ఐటీసీ పేపర్‌ బోర్డు అధికారులతో చర్చలు జరిపి రోజూ 5 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేసేవిధంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆక్సిజన్​ను జిల్లా ఆస్పత్రిలోని ట్యాంకర్​లో నిల్వచేస్తామని... అవసరం ఉన్న ఆస్పత్రుల వారు వచ్చి తీసుకువెళ్లవచ్చన్నారు.

జిల్లాలో ఆక్సిజన్‌ అందలేదన్న వార్త రాకూడదని మంత్రి చెప్పారు. హెటిరో డ్రగ్స్‌ అధినేతతో మాట్లాడి జిల్లాకు కావాల్సిన రెమ్​డిసివిర్‌ ఇంజక్షన్​లను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో 320 పడకలతో కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మధిర, సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ప్రత్యేకంగా కరోనా పడకలు ఏర్పాటు చేసి చికిత్స ప్రారంభిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: కరోనా వేళ నిరాడంబరంగా రంజాన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.