ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుమ్మడిదల గౌరీశంకర్ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సుద్ద ముక్కపై రెండున్నర గంటల సేపు శ్రమించి గణపతి ఆకృతిని చెక్కారు. గణపతిని అందంగా తీర్చిదిద్దినందుకు పలువురు గౌరీశంకర్‌ను అభినందించారు.
ఈ ఏడాది కొవిడ్ మహమ్మారి కారణంగా వేడుకలు సరిగ్గా జరుపుకోలేకపోతున్నందుకు గౌరీశంకర్ బాధపడ్డారు. ప్రజలందరూ కరోనా కట్టడి చర్యలను పాటిస్తే.. వ్యాధిని నివారించి.. యథావిధిగా బయట స్వేచ్ఛగా తిరొగచ్చని అభిప్రాయపడ్డారు.