ఖమ్మం జిల్లా దానవాయిగూడెం డంపింగ్ యార్డుకు చెత్త తరలింపు నిలిపేయాలంటూ స్థానిక కాలనీ ప్రజలు ఆందోళనకు దిగారు. ఆరు నెలలుగా డంపింగ్ యార్డు మూసేసి.... రఘునాథపాలెం క్వారీలకు చెత్తను తరలించేవారని.... కానీ మళ్లీ ఇప్పుడు చెత్తను ఇక్కడికి తీసుకొస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డంపింగ్యార్డు వల్ల రాపర్తి నగర్, దానవాయి గూడెం, టీఎన్జీవో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెత్తను తీసుకొచ్చిన ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఉన్నతాధికారులతో చర్చించి ట్రాక్టర్లను తరలించారు.
ఇదీ చూడండి: నేడు గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన