ETV Bharat / state

ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు - సీపీఐ సీపీఎం ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాయి

Khammam Political Heat 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. నామినేషన్ల ప్రక్రియకు తెరలేవనుంది. హంగూ ఆర్భాటాలతో పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ప్రచార ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు.. బహిరంగ సభలతో హోరెత్తించేలా రాజకీయ పార్టీలన్నీ దూకుడు పెంచుతుండటంతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ పోరు రంజుగా మారుతోంది.

BRS Election Campaign in Khammam District
Congress strategy in Khammam district
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 11:17 AM IST

Khammam Political Heat 2023 : అభ్యర్థుల ప్రకటన, పార్టీ మేనిఫెస్టో ప్రకటన నుంచీ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, ప్రతిపక్షాల కన్నా ఓ అడుగు ముందంజలోనే ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో గులాబీ దండు మోహరించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ మద్దతు కూడగడుతోంది. ఓ వైపు ప్రచారపర్వాన్ని ఉద్ధృతంగా కొనసాగిస్తూనే.. వారానికోసారి మీడియా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

BRS Campaign in Khammam : అభ్యర్థులు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలతో మరింత స్పీడు పెంచింది. తొలి బహిరంగ సభగా పాలేరు నుంచి ఎన్నికల సమరశంఖం పూరించి శ్రేణుల్ని ఎన్నికల కదనరంగంలోకి దింపింది. తొలి దఫాలో మిగిలిన రెండు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభ(BRS Public Meetings)లను విజయవంతం చేసేలా గులాబీ శ్రేణులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Khammam BRS Election Campaign 2023 : అభ్యర్థుల ఎంపిక, ప్రకటన కాసింత ఆలస్యమైనప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం చేస్తుందన్న అపవాదును మూటగట్టుకుంటున్నప్పటికీ.. ఎక్కడా అధికార పక్షానికి పైచేయి ఇవ్వకుండా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 స్థానాల్లోనే ఇప్పటివరకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగిలిన ఐదు స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తోంది. ఖమ్మం, పాలేరు నుంచి తుమ్మల, పొంగులేటిని వ్యూహాత్మకంగా రంగంలోకి దించింది. ఇద్దరు నేతలు పాత, కొత్త నాయకులను కలుపుకుంటూ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం సాగిస్తున్నారు. అనూహ్యంగా ఖమ్మం నుంచి బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు అదే స్థాయిలో ప్రచారంలో స్పీడు పెంచారు.

"మళ్లీ అధికారంలోకి బీఆర్​ఎస్​ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న విషయం ప్రజా ఆశీర్వాద సభల ద్వారా తెలుస్తోంది. కేసీఆర్ సభలకు పోటెత్తుతున్న ప్రజలను చూస్తుంటే మరోసారి బీఆర్ఎస్​ను ఆశీర్వదించేందుకు వారంతా రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. ఈ నెల 5వ తేదీన ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్నాం. అదే రోజు కొత్తగూడెంలో కూడా సభ ఉంటుంది." - పువ్వాడ అజయ్ కుమార్​, రవాణాశాఖ మంత్రి

Political Heat in Khammam District : రసవత్తరంగా ఖమ్మం రాజకీయం.. నువ్వానేనా అంటూ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఢీ

Congress Election Campaign in Khammam 2023 : పాలేరుకు ఆరు గ్యారంటీల పేరిట సరికొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న పొంగులేటి మద్దతు కూడగడుతున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈనెల 4న ముదిగొండ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. భద్రాచలంలో పొదెం వీరయ్య, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు ప్రచార పర్వం మొదలుపెట్టారు. అయితే.. మిగిలిన ఐదు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన(Congress MLA Candidate Release) రేపో, మాపో ఉంటుందంటూ ఊరిస్తున్నా.. అభ్యర్థిత్వాల లెక్కలు తేలకపోవడంతో నిరీక్షణ తప్పడం లేదు.

BJP Election Campaign in Khammam 2023 : అటు భారతీయ జనతాపార్టీ మరో ముగ్గురు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే ఇల్లందు- రవీంద్రనాయక్, భద్రాచలం- కుంజా ధర్మారావు పేర్లు ప్రకటించగా.. గురువారం మరో మూడు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. పాలేరు- నున్నా రవికుమార్, సత్తుపల్లి- రామలింగేశ్వరరావు, పినపాక- పొడియం బాబూరావుల అభ్యర్థిత్వాలు ప్రకటించింది. మిగిలిన ఐదు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.

Congress Left Parties Alliance Telangana 2023 : అనేక చర్చోపచర్చలు, ఊగిసలాటల మధ్య కాంగ్రెస్- కమ్యూనిస్టుల పొత్తులు చివరకు అటకెక్కాయి. ఫలితంగా వామపక్షాలు అసెంబ్లీ పోరులో బరిలోకి దిగేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. సీపీఎం ఏకంగా 7 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి ఎన్నికల పోరుకు సై అని ప్రకటించింది. ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర, పాలేరు, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ స్థానాల్లో అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. ఇంకోవైపు కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై స్పష్టత రాకపోవడంతో సీపీఐ వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది.

Minister Puvvada on Tummala Nageswara Rao : 'మంత్రి పదవి ఇవ్వకపోతే.. రాజకీయాల నుంచి తుమ్మల ఎప్పుడో రిటైర్ అయ్యేవారు'

Congress CPI Alliance Issue Telangana 2023 : ఇవాళ పొత్తు విషయంలో స్పష్టత రాకపోతే తాము పోటీ చేసే స్థానాలను ప్రకటించేలా సీపీఐ సమాయత్తమవుతోంది. ఈ సమయంలో కొత్తగూడెం బరిలో సీపీఐ నుంచి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 8 మంది కౌన్సిలర్లు డిమాండ్ చేయడం కలకలం రేపింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పోటీకి సిద్ధమైన తరుణంలో.. సాబీర్ పాషాను ప్రకటించకపోతే రాజీనామా చేస్తామని కౌన్సిలర్లు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సీపీఐ- సీపీఎం కలిసి బరిలో నిలిచేలా ప్రణాళికలు చేస్తున్నట్టు సమాచారం. పాలేరు బరిలో నిలుస్తానని వైఎస్ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించినప్పటికీ.. అందుకు తగిన కార్యాచరణ ఇప్పటి వరకు ఏమీ ఖరారు కాలేదు.

'గత 75 ఏళ్లుగా జరగలేని అభివృద్ధిని తొమ్మిదిన్నర ఏళ్లలో చేసి చూపించాం'

Congress MLA Tickets Disputes in Joint Khammam District : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నేతల పట్టు.. తేలని సీట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.