లాక్‌డౌన్ నేపథ్యంలో.. వృద్ధులు, వికలాంగులకు దాతలు అండగా నిలిచారు. ఖమ్మం జిల్లాలో తల్లాడ గ్రామంలో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో.. నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 60 మంది వికలాంగులకు సరకులు అందజేశారు.
విపత్కర సమయంలో పేదలకు మానవతా దృక్పథంతో పంపిణీ చేయడం పట్ల ఎస్సై తిరుపతిరెడ్డి నిర్వాహకులను అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. కరోనా వైరస్ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు.
ఇదీ చూడండి: కేంద్ర బడా నేతల బండారంపై సీబీఐ విచారణ జరగాలి..