ETV Bharat / state

మంత్రి పువ్వాడ సమక్షంలో తెరాసలో చేరిన కాంగ్రెస్​ కార్యకర్తలు - మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​

మతోన్మాద భాజపాపై ప్రాంతీయ పార్టీలు పోరాడుతున్నాయని.. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ ఉనికిని కోల్పోయిందని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో తెరాస తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్​ కార్యకర్తలను ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

joinings in trs party from congress party in khammam
మంత్రి పువ్వాడ సమక్షంలో తెరాసలో చేరిన కాంగ్రెస్​ కార్యకర్తలు
author img

By

Published : Oct 1, 2020, 10:27 PM IST

ఖమ్మం జిల్లా తెరాస పార్టీ కార్యాలయంలో తెరాస తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్​ కార్యకర్తలను మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు మతోన్మాద భాజపాపై పోరాడుతున్నాయని.. రాష్ట్రంలో సైతం కాంగ్రెస్​ పార్టీ పని అయిపోయిందని మంత్రి అన్నారు. చింతకాని మండలం నుంచి దాదాపు 80 మంది కాంగ్రెస్​ కార్యకర్తలు తెరాసలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు తెరాస కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరిన వారిని.. చివరి వరకు కాపాడుకుంటామని, ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి : పోలీస్​ వాహనం ఢీకొని ఒకరు.. టిప్పర్​ చక్రాల కింద నలిగి ఇంకొకరు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.