ETV Bharat / state

మున్సిపల్​ కౌన్సిలర్​ రాసలీలలు.. మహిళపై దాడికి దిగిన భార్య - ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్ భార్య దాడి

ప్రజాప్రతినిధి భార్య ఓ మహిళపై దాడికి యత్నించింది. ఎందుకంటే ఆమె కూడా ఓ భార్యే కాబట్టి..! అదేంటీ అనుకుంటున్నారా..? అదేనండి ప్రజాప్రతినిధిగా ఉన్న తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిశాక.. ఊరికే ఉంటుందా ఏంటీ..! అసలు ఎవరా ప్రజాప్రతినిధి..?

Illandu muncipal councilor wife attack on another women for illigal contact

author img

By

Published : Jul 6, 2022, 5:37 PM IST

సాధారణంగా ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటారు. వాళ్ల బాధ అంతా విని.. నిజానిజాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించటం ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యత. కానీ.. ఇక్కడ మాత్రం సీన్​ రివర్సయ్యింది. ప్రజల సమస్యలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధి ఇంట్లోనే సమస్య తలెత్తింది. గుట్టుగా పరిష్కరించుకోవాల్సిన సమస్య కాస్తా.. బట్టబయలై రోడ్డున పడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ ప్రజాప్రతినిధిగా ఉన్న అధికార పార్టీ నేత భార్య.. మరో మహిళపై దాడికి దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇల్లందు మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్​ భార్య సుభాష్​నగర్​లోని ఒక ఇంట్లో ఉన్న మహిళపై బంధువులతో కలిసి దాడి చేసింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంటావా..? అంటూ మహిళ కుమారుల ముందే ఆమెపై దాడికి దిగటంతో.. స్థానికులు అడ్డుకున్నారు. కాగా.. సదరు నాయకుడు తనను వివాహం చేసుకున్నాడని.. కుటుంబ పోషణ కూడా తానే చూసుకుంటున్నాడని ఆ మహిళ స్థానికులకు చెప్పడంతో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది.

పట్టణానికి చెందిన ప్రముఖ నాయకుడి కుటుంబ సభ్యులు బహిరంగంగానే దాడికి యత్నించటంతో.. అందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో ఈ అంశం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.