ఖమ్మం జిల్లా మధిరలోని మానసిక దివ్యాంగుల సేవాసదన్‌లో యార్లగడ్డ శోభన్ రావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ కుటుంబ సభ్యులు.. అన్న ఫౌండేషన్ ఛైర్మన్ మేళం శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా మానసిక దివ్యాంగులకు నెలకు సరిపడా నిత్యావసర సరకులు అందజేశారు.
సరకుల కొనుగోలుకు ఆర్థిక సాయం చేసిన శోభన్ రావు కుటుంబ సభ్యులు కీర్తి చౌదరి, మౌనిక, వర్ణిక, తన్మయి రిషిలను శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. అనంతరం మానసిక దివ్యాంగుల సేవాసదన్‌లో అన్నదానం నిర్వహించారు.
- ఇదీ చూడండి : తెలంగాణలో మరో 1,724 కరోనా కేసులు, 10 మంది మృతి