నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలో ప్రసిద్దమైన గార్లొడ్డు శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. కొత్త ఏడాదిలో శుభాలు కలగాలని భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయం పక్కన ఉన్న పెద్దమ్మతల్లికి మహిళలు బోనాలు సమర్పించారు. క్రైస్తవ మందిరాలలో ప్రత్యేక ప్రార్దనలు చేశారు. ఏన్కూరు మండలం టీఎల్‌పేట ఆర్సీఎం చర్చికి క్రైస్తవులు తరలివచ్చి ఆల్‌నైట్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఆలయాల్లో పండితులు, చర్చిలలో ఫాదర్లు నుంచి భక్తులు ఆశీర్వచనాలు పొందారు.
ఇవీ చూడండి: యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం