ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో నిప్పంటుకుని 12 గడ్డివాములు దగ్ధమయ్యాయి. తోట ప్రకాశ్‌రావు, గోవిందు నర్సయ్యకు చెందిన పెద్ద గడ్డివాములకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోగా అధికారులు, గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. సకాలంలో మంటలు ఆర్పే ప్రయత్నం చేయడం వల్ల మరిన్ని గడ్డివాములు, సమీపంలోని ఇళ్లకు వ్యాపించకుండా అరికట్టారు.
మొదట గడ్డివాములకు నిప్పంటుకోగానే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లాడ ఎస్సై తిరుపతిరెడ్డి స్పందించి వైరా అగ్నిమాపక సిబ్బందికి సమచారమిచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల 5 పంచాయతీల నుంచి ట్యాంకర్లు తెప్పించారు. స్థానికులను ప్రోత్సహించి 100 మంది యువకులతో మంటలు అదుపు చేయించారు.
పోలీస్, అగ్నిమాపక సిబ్బందికి తోటు పంచాయతీ ట్రాక్టర్లు, యువకుల సాయంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. పది రోజుల క్రితం ఇదే మండలంలోని రామచంద్రాపురంలో 3 పూరిళ్లు, 3 గడ్డివాములు అగ్నికి ఆహుతి కాగా రెండో ప్రమారదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది.
ఇదీ చూడండి:జులై వరకు మిడతల ముప్పు తప్పదు!