తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా పెనుబల్లి, సత్తుపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ కోసం పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి సంఘీభావం తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతన చట్టం ప్రకారం రూ. 21,000 వేతనం ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!