కందుల కొనుగోలులో మార్క్ఫెడ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా వైరా మార్కెట్ యార్డ్ ఎదుట రైతులు ఆందోళన చేశారు. పది రోజుల క్రితం కేంద్రం ప్రారంభించినా కొనుగోలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమశాతం పేరుతో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైరా-మధిర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చ చెప్పారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: 'సమస్యలు లేని పట్టణాలను తీర్చిదిద్దడానికే పట్టణ ప్రగతి'