ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ మందుబాబు కాసేపు భయానక వాతావరణం(drunk man hulchul) సృష్టించాడు. మద్యం మత్తులో కత్తితో వీరంగం చేశాడు. వేంసూరు మండలం దుద్దెపూడికి చెందిన మిరియాల సురేశ్ బాబు.. పూటుగా మద్యం సేవించాడు. మత్తులో అదే మద్యం దుకాణం వద్ద గొడవ చేశాడు. అనంతరం కొబ్బరికాయలు కొట్టే కత్తి తీసుకుని అందరినీ బెదిరించాడు.
చేతిలో కత్తి చూసి భయంతో..
జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు, కార్లపై దాడికి యత్నిస్తూ వీరంగం సృష్టించాడు. ఓ బైక్ మెకానిక్ దుకాణంలోకి వెళ్లి పని చేసే వారిని కత్తితో భయపెట్టాడు. ఆ దుకాణ నిర్వాహకుడు అజార్.. ఆ మందుబాబుపైనే దృష్టి పెట్టాడు. పోలీసులు కూడా విషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్నారు. కానీ.. ఏం చేయలేని పరిస్థితి. మందుబాబు చేతిలో కత్తి ఉండటం వల్ల ఎలాంటి సాహసం చేసేందుకు ముందుకు రాలేదు.
ఒక్క ఉదూటునా...
ఈ క్రమంలోనే మందుబాబు కారుపై కత్తితో దాడి చేశాడు. కత్తితో కారు అద్దాన్ని ధ్వంసం చేసే క్రమంలో కత్తి చేయి జారి కింద పడింది. ఇదే అదునుగా భావించిన అజార్.. ఒక్క ఉదూటుగా మందుబాబుపై దూకి కిందపడేశాడు. మందుబాబునే గమనిస్తున్న స్థానికులంతా.. క్షణంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా అప్రమత్తమై.. అక్కడున్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మందుబాబును అదుపులోకి తీసుకున్నారు.
మందుబాబును పట్టుకోవడంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన అజార్‌ను పోలీసులు అభినందించారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన సురేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: