వైద్యులపై భౌతిక దాడులు చేయొద్దంటూ ఖమ్మంలో వైద్యులు ధర్నా నిర్వహించారు. ముందుగా ఐఎంఎ హాల్ నుంచి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ తీశారు. బస్టాండ్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కలకత్తాలో వైద్యులపై దాడిని సమాజం ఖండించాలని కోరారు. వైద్యులపై దాడులు చేస్తుంటే పరిస్థితి విషమంగా ఉన్న కేసులను ఎవరూ తీసుకోపని దాని వల్ల రోగులకే ఇబ్బందులు కల్గుతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'గెలిపించిన ప్రజలకు సేవ చేయలేకపోతున్నా..'