ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని ఏన్కూరు మండలంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజాసేవలో గ్రామీణ వైద్యులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో కార్పొరేట్ ఆసుపత్రులు మూతపడినా... గ్రామ స్థాయిలో ఆర్‌ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉంటూ చక్కటి సేవలందించారని కొనియాడారు. వైద్య సేవలతోపాటు ఆకలితో ఉన్న వలస కూలీలకు సరకులు వితరణ చేసి మానవత్వం చాటారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, సర్పంచ్ కృష్ణ ప్రియ, ఎంపీటీసీ ప్రమీల, సొసైటీ ఏఎంసీ ఛైర్మన్లు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, భూక్యా లాలూ నాయక్, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.
జూలూరుపాడు మండలం గురవాగుతండాలో వలస కూలీలకు ఎమ్మెల్యే రాములు నాయక్ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
వైరా పురపాలక పరిధిలోని 12వ వార్డు కౌన్సిలర్ వనమా విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జూలూరుపాడు మండలం గురవాగుతండాలో వలస కూలీలకు ఎమ్మెల్యే రాములునాయక్ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి : ఇంకొంత కాలం లాక్డౌన్ కొనసాగిస్తే మనం సేఫ్ : కేసీఆర్