పెరిగిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ... ఖమ్మంలో సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సరిత క్లినిక్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాళీ వంట గ్యాస్ సిలిండర్లను ప్రదర్శించారు. కట్టెల పొయ్యి పెట్టి నిరసన తెలిపారు. దిల్లీ ఓటమిని జీర్ణించుకోలేని ప్రభుత్వం ప్రజలపై ధరల భారం మోపిందని అన్నారు.
ఇవీ చూడండి: ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు