Congress CPI Alliance For Telangana Elections 2023 : కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానం కమ్యూనిస్టు పార్టీకి ఖరారైంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సమావేశమై చర్చించిన తర్వాత.. కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేస్తుందని ప్రకటించడంతో... పొత్తుల అంశం కొలిక్కి వచ్చింది. అయితే.. కొత్తగూడెం బరిలో సీపీఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగూడెం నుంచి కూనంనేని పేరును ప్రతిపాదిస్తూ.. జిల్లాకార్యవర్గం తీర్మానించి రాష్ట్ర కమిటీకి పంపింది. కేంద్ర కమిటీ ఆమోదంతో అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.
Kunamneni To Contest From Kothagudem : సుజాతనగర్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1999లో, 2004లో కూనంనేని అసెంబ్లీ బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. 2014లో సీపీఐ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్‌కి సీటు దక్కడంతో కూనంనేని పోటీ చేయలేదు. మరోసారి కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సీటు దక్కడంతో.. కొత్తగూడెం బరిలో నిలిచేందుకు కూనంనేని సన్నద్ధమవుతున్నారు. ఐదోసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్న కూనంనేని సాంబశివరావు... రాష్ట్ర కార్యదర్శి హోదాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి
Congress CPI Alliance in Kothagudem Constituency : కాంగ్రెస్ మూడో జాబితా ప్రకటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం సీపీఐకి కేటాయించిన స్థానం మినహామిగిలిన 9 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇల్లందునుంచి కోరంకనకయ్య, వైరాలో మాలోతు రామదాస్, సత్తుపల్లి మట్టారాగమయి, అశ్వారావుపేట జారె ఆదినారాయణ పేర్లను... హస్తం పార్టీ ఖారారు చేసింది. తొలి రెండు జాబితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కేవలం 5 స్థానాల్లో మాత్రమే.. అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటం.. ఈనెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుండటంతో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.
కాంగ్రెస్ బీ ఫామ్ నిలిపివేసిన స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట
టికెట్ తమకే వస్తుందని కొండంత ఆశతో ఉన్న అభ్యర్థులు.. తాజా ప్రకటనతో నామినేషన్లకు సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు ఆశావహులు పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఇల్లందులో కోరం కనకయ్య, చీమల వెంకటేశ్వర్లు, మంగీలాల్ నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేటలో హస్తం పార్టీ తరఫున ఎవ్వరూ నామినేషన్లు వేయలేదు. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులు జోరుగా ప్రచార పర్వంలో మునిగితేలుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద సభలతో పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. తొలిదఫాలో 5 నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొనగా ఈ నెల 13, 21 మరికొన్ని నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.
తెలంగాణలో జోరుగా నామినేషన్లు, ఇవాళ ముఖ్య నాయకుల్లో రేవంత్, బండి సంజయ్