ఆరేళ్ల తెరాస పాలనలో పురపాలికల్లో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టలేదని సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలో రోడ్డు షో నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. వీటికి పురపాలకాల్లో పారిశుద్ధ్యం లోపమే కారణమన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఉన్న ఇళ్లు మినహా ఎక్కడా కూడా రెండు గదుల ఇళ్లు తెరాస ప్రభుత్వం మంజూరు చేయలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలు చేయడమే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, ప్రజలకు మంజూరు చేసే సంక్షేమ నిధులకన్నా మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: 'మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలి'