ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ ఆర్.వి కర్ణన్ చేతుల మీదగా సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించారు. శ్రీ సత్యసాయి సేవా సమితి, ఆశాజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ చొరవతో.. ప్రవాసాంధ్రుల ఆర్థిక సహకారంతో సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
శ్రీ సత్యసాయి సేవా సంస్థ సేవలు అమోఘమని కలెక్టర్ ప్రశంసించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆక్సిజన్‌తో పాటు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి మాలతి, సత్యసాయి సేవా సమితి జిల్లా కన్వీనర్ సుధాకర్ పాల్గొన్నారు.