ETV Bharat / state

నేడు కొత్తగూడెం, ఖమ్మంలో బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలు - హాజరుకానున్న సీఎం కేసీఆర్ - ఖమ్మం జిల్లా ప్రజాఆశీర్వాద సభ

CM KCR Public Meeting Today : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో రెండు ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో మూడు బహిరంగ సభలకు హాజరైన కేసీఆర్​ ఇవాళ కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభలకు హాజరుకానున్నారు. ఈ బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు గులాబీ నేతలు వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్‌లు విస్తృత ఏర్పాట్లు చేశారు.

CM KCR Praja Ashirvada Sabha
Khammam BRS Publice Meeting Today
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 7:43 AM IST

CM KCR Meetings నేడు కొత్తగూడెం, ఖమ్మంలో సీఎం కేసీఆర్​ బహిరంగ సభలు

CM KCR Public Meeting Today : కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్​ఎస్​ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు మద్దతుగా స్థానిక ప్రకాశం మైదానంలో ఇవాళ మధ్యాహ్నం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్​ హాజరుకానున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం వచ్చిన కేసీఆర్​.. ఆ తర్వాత నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం వచ్చారు. మళ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కొత్తగూడెం రానున్నారు.

హెలికాప్టర్‌లో ప్రగతి మైదానం చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. చాలా రోజుల తర్వాత సీఎం జిల్లా కేంద్రానికి వస్తుండటంతో గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంతో కొత్తగూడెం పరిసరాలన్నీ గులాబీ మయంగా మారాయి. ప్రధాన రహదారుల్లో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

"కొత్తగూడెంలో ఎక్కువ మంది వచ్చి సీఎం కేసీఆర్ ప్రసంగం వినేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. దాదాపు 80 వేల మందిని గ్రామాల నుంచి తరలించేందుకు కృషి చేస్తున్నాం."- వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం బీఆర్​ఎస్​ అభ్యర్థి

ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలే అందుకే ఆలోచించి ఓటేయండి : కేసీఆర్

CM KCR Praja Ashirvada Sabha in Khammam : కొత్తగూడెం బహిరంగ సభ తర్వాత సీఎం కేసీఆర్​ ఖమ్మం ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ(CM KCR Khammam Public Meeting)కు హాజరవుతారు. ఈ ఏడాదే జనవరి 18న ఖమ్మం గడ్డపై నుంచే బీఆర్​ఎస్​ ఆవిర్బావ బహిరంగ సభకు కేసీఆర్​ హాజరయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం బీఆర్​ఎస్​ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కు మద్దతుగా మాట్లాడేందుకు హాజరవుతున్నారు. స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

CM KCR Meetings Arrangements in Khammam : గులాబీ దళపతి హాజరయ్యే బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రి పువ్వాడ అజయ్ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని డివిజన్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ గులాబీమయమయ్యాయి. ఇప్పటికే సభాస్థలిలో ఏర్పాట్లను మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పరిశీలించారు. ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ(Praja Ashirvada Sabha)కు వేలాదిగా జనం తరలిరావాలని మంత్రి పువ్వాడ అజయ్ కోరారు.

'రైతుబంధు ఉండాలో వద్దో రైతులే ఆలోచించుకోవాలి'

Police Checking CM KCR Meeting Arrangements : రెండు బహిరంగ సభలకు పోలీస్​ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం పర్యటనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసు అధికారులు.. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కొత్తగూడెం, ఖమ్మంలోని బహిరంగ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన పోలీసులు.. సీఎం పర్యటన దృష్ట్యా ఆంక్షలు విధించారు.

సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ విడుదల 16 రోజులు 54 సభలు

'రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.