CM KCR Comments ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. సభకు తరలివచ్చిన ఆత్మీయ బంధువులకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని స్పష్టం చేశారు. ఖమ్మంలోని ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నట్లు హామీనిచ్చారు. 10 వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అని వివరించారు. ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, ఖమ్మం మున్నేరు నదిపై వంతెన నిర్మాణంతో పాటు.. ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ హామీల వర్షం కురిపించారు.
జర్నలిస్టులకు ఖమ్మం జిల్లా కేంద్రంలో నెలలోగా ఇళ్ల స్థలాలు ఇస్తాం. ప్రభుత్వ స్థలం దొరక్కపోతే సేకరించైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. భారాస విధానం, వ్యూహం తర్వాత వివరంగా చెబుతాం. భారత్ అన్ని విధాలా సుసంపన్నమైన దేశం. జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామి. - సీఎం కేసీఆర్
ఇవీ చూడండి: