ETV Bharat / state

పేదల విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలి : సీఎల్పీ నేత భట్టి

author img

By

Published : Jul 6, 2020, 7:00 PM IST

కొవిడ్ క్లిష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా మోపి వినియోగదారుల నడ్డి విరుస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. అధిక విద్యుత్ బిల్లులు తగ్గించాలంటూ ఖమ్మం జిల్లా మధిర విద్యుత్ ఆఫీస్​ ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టింది.

పేదల విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి : సీఎల్పీ నేత భట్టి

ఖమ్మం జిల్లా మధిరలో విద్యుత్ శాఖ కార్యాలయం ముందు అధిక విద్యుత్ బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అసమర్థుడని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. పది రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు కనబడట్లేదని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రికి బాధ్యత లేదా ?

కొవిడ్ కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలవాల్సిన వ్యక్తి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలమీద మోపిన అధిక విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం మరింత ఉద్ధృతం చేయనున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మల్లాది వాసు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రంగ హనుమంత రావు, సూరంశెట్టి కిషోర్, వేణు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.