ఖమ్మం జిల్లా వైరాలోని రహదారుల వెంట దీనస్థితిలో తిరుగుతున్న మతిస్థిమితం లేని వ్యక్తులను అన్నం ఫౌండేషన్ చేరదీసింది. వైరా మున్సిపాలిటీ పరిధిలో మతిస్థిమితంలేని వ్యక్తులు ఉన్నారని తెలుసుకున్న అన్నం ఫౌండేషన్ సభ్యులు... వారిని తీసుకెళ్లేందుకు వచ్చారు. స్థానిక పోలీసుల సహకారంతో ముగ్గురు వ్యక్తులను గుర్తించి ఆశ్రమానికి తీసుకెళ్లారు. మాసిన గడ్డం, చిరిగిన దుస్తులతో ఉన్న ఓ వ్యక్తి తనది వనపర్తి అని, బీకాం చదివానని వివరాలిచ్చాడు. ఆ వ్యక్తికి ప్రత్యేక చికిత్స అందించి మానసికంగా కోలుకున్న తర్వాత కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' దోషులకు ఉరి ఆలస్యం- జనవరి 7న నిర్ణయం!