ETV Bharat / state

'ఆదివాసీల పోడు సాగును అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు' - ఖమ్మంలో గిజనుల పోడు వ్యవసాయం తాజా వార్త

అడవుల్లో నివాసం ఉంటూ.. పోడు సాగు చేసుకుని జీవించే ఆదివాసీలపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి ఆరోపించారు. ఖమ్మం వేదికగా ఆయన ప్రభుత్వాన్ని వారి భూమిని వారి ఇవ్వమంటూ డిమాండ్​ చేశారు.

All India Agricultural Association Secretary of State Rangareddy in Khammam  A press meet was arranged on tribal agriculture
'ఆదివాసీల పోడు సాగును అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు'
author img

By

Published : Aug 5, 2020, 8:07 PM IST

ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలను పోడు చేయకుండా ఫారెస్టు అధికారులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి ఆరోపించారు. అమాయక ఆదివాసీ మహిళలపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూమిని ఫారెస్టు అధికారులు లాగేసుకున్నారని.. అడిగేందుకు వెళ్లిన తమపై కేసులు పెట్టి జైలుకు పంపారని జానకి అనే మహిళ వాపోయింది. వారి భూమి వారికి ఇచ్చేయాలని రంగారెడ్డి కోరారు.

ఇవీచూడండి : రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.