ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరిందని వాటిలో ఖమ్మం పట్టణంలోనే ఆరు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి వెల్లడించారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకడం చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. కేసుల సంఖ్య పెరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురికి కరోనా సోకగా...ఇద్దరు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఆ రాష్ట్రంలోకీ ఎంటరైన కరోనా- నేడు తొలి కేసు నమోదు