ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలో గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ హాజరయ్యారు. 30 రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్లో నలుగురు దొంగల అరెస్ట్