కరీంనగర్ బస్టాండులో బస్సులు లేక నిలిచిపోయిన ప్రయాణికులకు యువసేన ఫౌండేషన్ ఆకలి తీరుస్తుంది. ఫౌండేషన్ ఛైర్మన్ చక్కిలం స్వప్న ఆధ్వర్యంలో ఆకలితో ఉన్నవారికి ఉచితంగా అల్పాహారాన్ని, భోజనాన్ని అందిస్తున్నారు.
ఒంటి గంట వరకే బస్సులు నడుస్తుండటంతో.. ఇతర ప్రాంతాల నుంచి కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చి ఆగిపోయిన వారికి భోజనం పెడుతున్నారు. ప్రతిరోజు 150 మందికి భోజనంతో పాటు సాయంత్రం వేళ అల్పాహారాన్ని అందిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్వప్న తెలిపారు.
ఇదీ చూడండి: CS: కరోనా మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం: సీఎస్