కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట గ్రామీణ పోలీస్ స్టేషన్ను వరంగల్ ఐజీ నాగిరెడ్డి సందర్శించారు. ఠాణాలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. జమ్మికుంట పరిధిలోని ఆయా పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను సీఐ ముత్తులింగంను అడిగి తెసుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
ఇవీ చూడండి : "తెలంగాణలోనూ రివర్స్ టెండరింగ్ విధానం తీసుకురావాలి"