కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. డిపో కార్యాలయం నుంచి ప్రయాణ ప్రాంగణం వరకు ర్యాలీ చేశారు. కరీంనగర్-వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ ముద్దురా.. ప్రైవేట్ వద్దురా అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాన రహదారిపై ధర్నాకు దిగటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు రంగంలోకి దిగారు.