కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేశారు. సేవ్ ఆర్టీసీ పేరుతో కార్మికులు డిపో నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. 'ప్రైవేటు వద్దు- ఆర్టీసీ ముద్దు' అంటూ నినాదాలు చేశారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
ఇదీ చూడండి: 'రైల్వేను ప్రైవేటీకరించం.. కార్పొరేటీకరిస్తాం అంతే!'